కర్నూలు జిల్లా ఆదోనిలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్వన్‌పేటలో నివాసముంటున్న చెన్నప్ప-పార్వతీల మూడవ కుమారుడు భరత్ కుమార్. నెహ్రూ మెమోరియల్ మున్సిపల్ ఉన్నత పాఠశాల లో 8వ తరగతి డి విభాగంలో చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచి కళాత్మక దృష్టి కలిగిన విద్యార్థి జి. భరత్ కుమార్ రావి ఆకుపై భారత దేశ చిత్ర పటాన్ని ఆవిష్కరించాడు. అందులో మన జాతీయ జెండా ఆకృతిని తయారు చేసి అబ్బుర పరిచాడు.