కర్ణాటక భక్తుల కోసం శ్రీశైలంలో ప్రభుత్వం రూ.200 కోట్లు ఎందుకు ఖర్చు చేస్తుందో తెలుసా?

నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో కొత్తగా నిర్మించనున్న కంబి మండపం, 200 గదులతో యాత్రికుల వసతి సముదాయ నిర్మాణానికి గురువారం శ్రీకారం చుట్టారు. జగద్గురు పీఠాధిపతి డాక్టర్ చెన్న సిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామిజి ఆధ్వర్యంలో కంబి మండపం యాత్ర నివాస్ కు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, శ్రీశైల దేవస్థానం ఛైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు భూమిపూజ నిర్వహించారు. కంబి మండపం భూమిపూజ శంకుస్థాపనలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆలయ చైర్మన్ రమేష్ నాయుడు పాల్గొన్నారు.