మరి ఇంత డెలికేటా..కారు బంపర్‌ను నోటితో పీకేసిన కుక్క.. నెటిజన్ల రియాక్షన్స్ ఏంటంటే

ఒక కుక్క.. ఎలుకను పట్టుకునే క్రమంలో చేసిన ఓ పనితో.. ప్రముఖ కార్ల కంపెనీకి చెందిన.. కారు బిల్డ్‌ క్వాలిటీపై సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతుంది. కుక్క నుంచి తప్పించుకునేందుకు ఎలుక ఒక కారులోకి దూరగా.. దాన్ని వెంబడించిన కుక్క.. ఆ కారు బంపర్‌ను తన పంటితో పీకేసి.. మరి ఎలుకను పట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో.. కారు బిల్డ్‌ క్వాలిటీపై ప్రస్తతం చర్చ జరుగుతుంది.