తెల్లవారుజామున బస్సులో హఠాత్తుగా చెలరేగిన మంటలు! ఈ తర్వాత..

ఆదివారం తెల్లవారుజామున త్రుటిలో మరో బస్సు ప్రమాదం తప్పింది. ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ గేట్ వద్ద బస్సులో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. బస్సు ఎయిర్ పైప్ లీక్ అవ్వడం తో టైర్లు హీట్ ఎక్కి పోగలు వచ్చాయి. సిబ్బంది వెంటనే గమనించడంతో టోల్‌ సిబ్బంది బస్సు నిలిపివేసింది. టోల్ పైకి లేకపోవడంతో పోగలు గమనించిన టోల్ సిబ్బంది డ్రైవర్ కు సమాచారం ఇచ్చారు. డ్రైవర్‌ బస్సును ఆపుచేసి హుటాహుటీన ప్రయాణికులను కిందకి దించడంతో ప్రమాదం తప్పింది.