తెలంగాణలో రైతు ఆత్మహత్యలకు కారణం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి పార్టీ స్టార్ క్యాంపెయిన్ చేసుకుంటున్నాయి. అయితే మల్లారెడ్డి ఈ ఎన్నికల్లో కేవలం తన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. అప్పుడప్పుడూ తన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంలేదు. దీనిపై స్పందించిన మంత్రి మల్లారెడ్డి తనకు తన నియోజకవర్గంలోనే ప్రచారానికి సమయం సరిపోవడంలేదని స్పష్టం చేశారు. కేసీఆర్, కేటీఆర్ బీఆర్ఎస్ తరఫున రాష్ట్రం మొత్తం పర్యటించి ప్రచారం చేయాలని ఆదేశిస్తే.. తప్పకుండా చేస్తానన్నారు. బయటి షెడ్యూల్ ప్లాన్ చేయాలంటే తన నియోజకవర్గం కూడా చూసుకోవాలి కదా అని బదులిచ్చారు.