ఐ బొమ్మ రవి న్యూ గెటప్ ఇదే.. పోలీసులు మధ్యలోనడుచుకుంటూ..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పైరసీ రాకెట్‌ ప్రధాన సూత్రధారి iBomma రవి కేసులో సైబర్ క్రైమ్ విచారణ మరింత వేగవంతమైంది. రెండవ దఫా పోలీస్ కస్టడీ లో అధికారులు మరోసారి కీలక అంశాలపై ప్రశ్నించారు. ఈ క్రమంలో రవికి చెందిన ఈ మెయిల్ అకౌంట్లను పోలీసులు పూర్తిగా రిట్రైవ్ చేయడంతో సంచలన వివరాలు వెలుగులోకి వచ్చాయి. మెయిల్‌లో స్పామ్, హైడ్ ఫైళ్లలో దాచిపెట్టిన రహస్య డేటాను సాంకేతిక నిపుణులు పరిశీలిస్తుండగా, పైరసీ ఆపరేషన్లకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన క్లూస్ బయటపడుతున్నాయని సమాచారం.