కృష్ణా నదిని ఈదుకుంటూ గోవుల వలస!

ఆహారం కోసం వలస వెళ్లే పక్షులు, చేపలు గురించి అందరికీ తెలుసు. కానీ తాజాగా కృష్ణా నదిలో గోవుల వలస అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మహబూబ్ నగర్ ప్రాంతానికి చెందిన ఒక కాపరి, కృష్ణా నదికి పూజలు చేసి వందకు పైగా గోవులను నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్‌లోకి దించాడు. అవన్నీ నదిని ఈదుకుంటూ ఆంధ్రప్రదేశ్ వైపు చేరాయి.