ఉదయం రణరంగంగా మారింది తెలంగాణ అసెంబ్లీ. భూభారతి బిల్లుపై చర్చను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. వెల్‌లోకి దూసుకెళ్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. పోడియం దగ్గర హరీష్‌రావు తోపాటు మరికొందరు ఎమ్మెల్యేలు హంగామా సృష్టించడంతో అసెంబ్లీ మార్షల్స్ అడ్డుకున్నారు. ఉదయం జరిగిన గొడవకు సంబంధించిన దృశ్యాలు బయటకు వచ్చాయి. బీఆర్‌ఎస్ సభ్యుల తీరుపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సభ్యుల దూకుడు చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు.