శ్రీ ప్రత్యంగిరా పరమేశ్వరి దేవాలయంలో ఘనంగా శాకంబరి ఉత్సవాలు..

హైదరాబాద్ కొత్తపేట శ్రీ రామకృష్ణ పురం లోని కుర్తాల పీఠం ఆదిపరాశక్తి శ్రీ ప్రత్యంగిరా పరమేశ్వరి దేవాలయం లో దేవతలకు, ఆలయ ప్రాంగణమంతా వేలకొలది వివిధ రకాల కూరగాయలతో ఆకుకూరలతో అలంకరణ సేవ జరిగింది. ఉదయం నుండి వేలాది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలచే శ్రీ లలిత శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం జరిగింది. భక్తులు విశేష హోమాలలో పాల్గొన్నారు.