సైఫ్‌ను పొడిచింది ఇతనే .. సీసీ ఫుటేజ్ నుంచి ఫోటో వదిలిన పోలీసులు

సైఫ్‌ను పొడిచింది ఇతనే .. సీసీ ఫుటేజ్ నుంచి ఫోటో వదిలిన పోలీసులు బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పై దుండగులు దాడి చేయడం కలకలం రేపింది. ఈ ఘటనతో బాలీవుడ్ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. సైఫ్ అలీఖాన్‌పై అర్ధరాత్రి దాడి జరిగింది. కత్తితో 6 సార్లు పొడిచాడు ఓ దుండగుడు. కాగా ఈ దాడిలో  రెండు కత్తి పోట్లు చాలా లోతుగా దిగాయి అని వైద్యులు తెలిపారు.. హత్య చేయాలనే ఉద్దేశంతో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు  నిందితుడి ఫొటో కూడా లభ్యమైంది. సీసీటీవీ ఫుటేజీలో నిందితుడి ఫొటోను పోలీసులు షేర్ చేశారు.