గోదావరి తీరం వెంట ఖాకీల డేగ కన్ను..! ఒకవైపు ఎన్‌కౌంటర్ల పరంపర కొనసాగుతుంటే.. మరోవైపు తెలంగాణ చత్తీస్‌గడ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో హై అలెర్ట్ కొనసాగుతోంది. మావోయిస్టులను మట్టుబెట్టేందుకు పోలీస్ బలగాలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అయితే జూలై 28 నుండి మావోయిస్టు పార్టీ అమర వీరుల సంస్కరణ వారోత్సవాల నేపథ్యంలో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు ముందస్తుగా అప్రమత్తం అయ్యారు. అడవులను జల్లెడ పడుతూ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు మావోయిస్టు పార్టీ కూడా అమరవీరుల వారోత్సవాలను విజయవంతం చేయాలని ఏజెన్సీ ప్రాంత ప్రజలకు పిలుపు నిచ్చింది..