జైలు నుంచే చదువు.. పీజీ లో గోల్డ్ మెడల్ కైవసం

హత్య కేసులో అతనొక జీవిత ఖైదీ. సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అదే జైలు తన జీవితాన్ని మార్చింది. చదువే అభివృద్ధి కి మార్గం అని గ్రహించాడు. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో pg సోషియాలజీ లో గోల్డ్ మెడల్ సాధించి తెలుగు రాష్ట్రాలలో నెంబర్ 1 స్టూడెంట్ అనిపించుకున్నాడు. పెరోల్ పై బయటకు వచ్చి గోల్డ్ మెడల్ అందుకుని తిరిగి ఈ రోజు జైల్ కి వెళ్ళాడు. ఇకపై నేరాలు చేయనని, ఆదర్శంగా నిలుస్తా అని అంటున్నాడు.