గోదావరి జలాలపై తేలియాడే రెస్టారెంట్‌..!

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గోదావరి తీరంలో బోట్ ఫ్లోటింగ్ రెస్టారెంట్ ని ప్రారంభించారు మంత్రి కందుల దుర్గేష్. టూరిస్టులు బోటులో ప్రయాణం చేసి గోదావరి మధ్యలో ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపే విధంగా ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్ ను ఏర్పాటు చేశారు. ప్రతిరోజు మధ్యాహ్నం సాయంత్రం దాదాపు 300 నుంచి 400 మంది వరకు గోదావరిలో విహరించేలా ఏర్పాట్లు చేశారు.