మరోసారి హైదరాబాద్‌లో గుప్పుమన్న గంజాయి..! టీవీ9, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆధ్వర్యంలో జాయింట్ ఆపరేషన్ విస్తృత తనిఖీల్లో లోగుట్టు బయటపడింది. వాషింగ్ మిషన్‌లో, ఇంట్లోని షెల్ఫ్‌ల్లో, పూల కుండీల్లో, వాటర్ సంప్‌లో, చివరకు కారు బంపర్‌లో దాచిన గంజాయి బయపడింది. ఖాకీల కంటపడకుండా ఖతర్నాక్ సెటప్ చేసుకోవడమే కాదు, పోలీసులొస్తే ఉసిగొల్పేందుకు కుక్కులను పెంచుతున్నారు. అయితే, జాయింట్ ఆపరేషన్‌తో డామిట్ గాళ్ల కథ అడ్డం తిరిగింది. చెక్ చేస్తే ఆల్ టుగెదర్‌గా 20 కేజీల గంజాయి పట్టుబడింది.