ఇటలీకి బయలుదేరిన రామ్ చరణ్, ఉపాసన.. మెగా ప్రిన్సెస్ క్లీంకార ఫస్ట్ ఫారిన్ ట్రిప్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులు ఇటలీ బయలుదేరారు. బుధవారం ఉదయం హైదరాబాద్ ఎయిర్ పోర్టులో తమ వారసురాలు క్లీంకార, చరణ్ ఫేవరెట్ పెట్ రైమ్ తో కలిసి కనిపించారు. అందులో క్లీంకార ఫేస్ కనిపించకుండా ఉపాసన జాగ్రత్తపడుతూ నడుస్తుండగా.. చరణ్ చేతిలో తన ఫేవరెట్ పెట్ రైమ్ కనిపిస్తోంది. ప్రస్తుతం వీరి ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.