సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ కొండముచ్చు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒక గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో కొండముచ్చుకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు ఆ కొండముచ్చు గాయాలకు చికిత్స చేశారు. మంచినీళ్ళు తాగించారు.