'సినిమాలో నటించాలి రాజకీయాల్లో కాదు'.. పవన్ కళ్యాణ్‎పై ముద్రగడ సంచలన వ్యాఖ్యలు..

ఈ మధ్య తన కుటుంబంలో చిచ్చుపెట్టారని.. అయినా తాను భయపడను అన్నారు ముద్రగడ పద్మనాభం. తన సొంత నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. తన అమ్మాయి తన ఆస్తి కాదన్నారు. తన కుటుంబాన్ని కాదు మీ కుటుంబాల్లో భరోసా కల్పించుకోండని సూచించారు. తన కూతురును మీకు అనుకూలంగా మార్చుకున్నారన్నారు. ఆమె తన బిడ్డ కాదని అత్తింటి బిడ్డ అని స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి కుటుంబాలను లాగారు కాబట్టి తాను కూడా లాగాల్సి వస్తుందన్నారు.