శ్రీవారి పరకామణిలో చోర శిఖామణి..

తిరుమల పరకామణిలో రవికుమార్‌ ఓ మఠం తరఫున పనిచేసేవాడు. ఏళ్ల తరబడిగా గుమస్తాగా ఉంటూ.. విదేశీ కరెన్సీని లెక్కించేవాడు. చాలాకాలంగా విదేశీ కరెన్సీని పక్కదోవ పట్టించాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి.. ఈ క్రమంలోనే.. 2023 ఏప్రిల్‌ 29న విదేశీ కరెన్సీని లెక్కిస్తూ.. అందులో కొన్ని నోట్లను పంచెలో ప్రత్యేకంగా కుట్టించుకున్న జేబుల్లో దాచుకున్నాడు.