ప్రభుత్వ కార్యాలయంలోకి చొరబడ్డ నాగుపాము, భయంతో పరుగులు తీసిన ఉద్యోగులు ఆ కార్యాలయం అంతా నిత్యం ఉద్యోగులు, రైతులతో నిండి ఉంటుంది. ఉదయం 9 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు నిరంతరం బిజీ బిజీగా ఉండే ఆ కార్యాలయంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఏమైందో ఏమో కానీ ఒక్కసారిగా ఎవరికివారు కేకలు వేసుకుంటూ భయంతో బయటకి పరుగులు తీశారు.