తెలంగాణ డీఎస్సీ పరీక్షలను మూడు నెలలపాటు వాయిదా వేయాలని, తక్షణమే 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రేవంత్ సర్కార్ తీరును నిరసిస్తూ డీఎస్సీ అభ్యర్థి గోపీ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు. తానుంటున్న హాస్టల్ గదిలోనే ఆమరణ దీక్షకు ఉపక్రమిస్తున్నట్లు సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు.