మద్యం మత్తులో శివాలెత్తిన ఆటోవాలా.. మద్యం మత్తులో ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. విధుల్లో ఉన్న కానిస్టేబుళ్ళపై విరుచుకుపడ్డాడు. ఈ సంఘటన హైదరాబాద్ మహానగరంలో సోమవారం జరిగింది. అంబర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ నాగరాజుపై బూతు పురాణం అందుకుని దాడి పాల్పడ్డాడు ఓ ఆటోవాలా. ఈ దాడిలో నాగరాజుతో పాటు మరో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.