సింగరేణిలో పని చేసే శ్రీనివాస్.. తల్లిదండ్రులు కోయ భాషలో మాట్లాడేవారు. ఇల్లందు ప్రాంతంలో నివాసం ఉండడంతో తెలుగు భాషలోనే మాట్లాడుకునేవారు. ఇటీవల లక్ష్మీదేవిపల్లికి చెందిన చింతా వినీతతో పెళ్లి నిశ్చయమైంది. ఈ సందర్భంగా వచ్చే నెల రెండోవ తేదీన వివాహ ముహుర్తాం ఫిక్స్ చేశారు. అయితే వారి భాషపై మమకారంతో మరి పెళ్లి కార్డులపై కోయ భాషతో ముద్రించాలనుకున్నాడు. ఈ తరంలో తమ భాష కనుమరుగా కాకుండా ఈ తరం పిల్లలు కూడా తెలుసుకునే విధంగా తమ భాషలో వెడ్డింగ్ కార్డు ముద్రించాడు.