సంక్రాంతి పండుగ వేళ ఇదో వి‘చిత్రం..’!

ఖమ్మం జిల్లాలో సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ సంచలనంగా మారింది. అభిమాన హీరోలకు.. రాజకీయ నాయకులకు ఫ్లెక్సీలను అభిమానులు ఏర్పాటు చేయడం సహజమే..! కానీ వేరు వేరు పార్టీలకు చెందిన నేతలు, సినిమా హీరోలతో కలిపి ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ హాట్ టాపిక్‌గా మారింది. రాజకీయంగా ఆకట్టుకునేలా గుర్తు తెలియని ఓ అభిమాని రోడ్డు పక్కన ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఆ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.