మువ్వన్నెల జాతీయ జెండా రూపుదిద్దుకున్నది.. ఇక్కడే.. మువ్వన్నెల జెండాను చూడగానే ప్రతి ఒక్కరి మనసు ఉప్పొంగుతుంది. మూడు రంగుల జెండా గాలి సోకితేనే ఎనలేని దేశభక్తి కలుగుతుంది. అలాంటి మువ్వన్నెల జెండాను ఏటా ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవన.. జనవరి 26న గణతంత్ర వేడుకల సమయంలో ఊరూవాడా ఎగురవేస్తుంటాం. అఖండ భారతావని సగర్వంగా నిలబడుతున్న త్రివర్ణ పతాక రూపశిల్పి మన తెలుగు బిడ్డే. భారత జాతి ఐకమత్యానికి సంకేతంగా నిలుస్తున్న పతాకం రూపు దిద్దుకుంది తెలంగాణలోనే.