ఫ్రీగా గుడ్లు.. ఇంకెందుకు వదిలిపెడతారు చెప్పండి..

జనగామ జిల్లాలో కోడిగుడ్ల వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది.. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ఉన్న గుడ్లన్ని చెల్లచెదురుగా రోడ్డు పై పడ్డాయి.. అసలే కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో.. రోడ్డుపై పడిపోయిన కోడిగుడ్ల కోసం జనం పరుగులు పెట్టారు. జనం గుడ్ల కోసం పరుగులు పెడుతుండడంతో ఆ డీసీఎం ఓనర్ తో సహా పోలీసులు ఆ గుడ్లు ఎవరు ఎత్తుకుపోకుండా కాపలా కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది..