పోస్ట్ మాస్టర్ అదృశ్యం.. డబ్బును జమ చేసిన ఖాతాదారులు షాక్..

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం గరుడఖండిలోని గ్రామీణ పోస్టాఫీసులో ఇంటి దొంగే కన్నం వేశాడు. రూ.2 లక్షలు నగదుతో పోస్ట్ మాస్టర్ పరారైన షాకింగ్ ఘటన వెలుగులోకి రావడంతో ఈ ప్రాంతంలో తీవ్ర సంచలనం రేపింది. గరుడఖండిలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‎గా విధులు నిర్వహిస్తున్న ప్రశాంత్ కుమార్, గత నాలుగు రోజులుగా ఖాతాదారులు జమ చేసిన రూ. 2 లక్షలు నగదును తన జేబులో వేసుకుని చేతి వాటం ప్రదర్శించాడు. కాశీబుగ్గలోని డివిజనల్ ఇండియన్ పోస్టల్ శాఖకు ఖాతాదారుల జమ చేసిన సొమ్ము చెల్లించకుండా రూ. 2 లక్షలు నగదుతో పరారయ్యాడు పోస్ట్ మాస్టర్.