బీఆర్ఎస్‎కు బిగ్ షాక్.. కాంగ్రెస్‎లో చేరనున్న మరో ఎమ్మెల్యే.. ముహూర్తం ఫిక్స్..

బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌ తగిలింది. తెలంగాణ లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‎లో చేరికలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని తన నివాసంలో కలిసారు. కాంగ్రెస్‎లో చేరేందుకు సిద్దమయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి అనంతరం అనేక రాజకీయ పరిణామాలు మారాయి.