సీఎం జగన్ ఎమ్మిగనూరులో ఎన్నికల ప్రచారం చేశారు. మేమంతా సిద్దం పేరుతో రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ బస్సుయాత్ర సాగనుంది. అయితే గతంలో సిద్దం పేరుతో నిర్వహించిన ప్రాంతాల్లో కాకుండా మిగిలిన ప్రాంతాల్లో దీనిని చేపట్టనున్నారు. తొలిరోజు ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన ఈ బస్సు యాత్ర రెండవ రోజు నంద్యాల చేరుకుంది. మూడవ రోజు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొన్నారు.