సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర ఏడో రోజుకి చేరింది. ఏడో రోజు బుధవారం కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన కొనసాగనుంది. ఉదయం 9గంటలకు అమ్మగారిపల్లె నుంచి బస్సుయాత్ర ప్రారంభం కానుంది. సదుం, కల్లూరు, దామలచెరువు, తలుపులపల్లి మీదుగా సీఎం జగన్ తేనెపల్లికి చేరుకోనున్నారు.