శ్వేత నాగులా కదిలే రూపం.. తెల్లని వస్త్రం.. దట్టమైన కవ్వాల్ అభయారణ్యం గుండా పదిరోజుల పాటు సాగుతున్న మహా పాదయాత్ర.. చూసేందుకు రెండు కనులు చాలవు అన్నట్టుగా మంత్ర ముగ్దులను చేస్తోంది. అదే మేస్రం వంశీయుల గంగాజల సేకరణ మహా పాదయాత్ర. ఈనెల 21 కెస్లాపూర్ నాగోబా ఆలయం నుండి ప్రారంభమైన ఈ పాదయాత్ర.. 110 కిలోమీటర్లు దట్టమైన అడవుల గుండా సాగి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగులోని గోదావరి హస్తినమడుగుకు చేరుకుంది.