ఐస్‌క్రీం వ్యాపారిని కారుతో ఢీకొట్టి చంపిన వ్యక్తి

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలోని చందౌసి పోలీస్ స్టేషన్ సమీపంలో దారుణం చోటుచేసుకుంది. రోడ్డుపై ఐస్‌క్రీం అమ్ముకుంటున్న అథల్ అలీ అనే వ్యక్తిని మరో వ్యక్తి కారుతో ఢీకొట్టి వెళ్లిపోయాడు. ఈ దాడిలో ఐస్‌క్రీం వ్యాపారి మృతి చెందాడు. అయితే ఉద్దేశపూర్వకంగానే కారు డ్రైవర్ దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.