కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండటంతో.. శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది.. ఈ క్రమంలో.. కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. డ్యామ్ గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. మంగళవారం శ్రీశైలంలో పర్యటించిన సీఎం చంద్రబాబు.. నిండుకుండలా మారిన శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు.