తిరుపతి జిల్లా నారాయణవనం తహసిల్దార్ కార్యాలయానికి తాళం పడింది. తహసిల్దార్ కార్యాలయంలో వాచ్‌మెన్‌గా ఉన్న తలారి లోపల ఉండగానే తాళాలు పడ్డాయి. ఉదయం యధావిధిగా సిబ్బంది కార్యాలయానికి చేరుకోగా.. తాళం వేసిన కార్యాలయం దర్శనమిచ్చింది. అసలు ఏం జరిగిందో తెలియక సిబ్బంది తికమక పడగా అప్పటికే తలారి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు.. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కార్యాలయానికి తాళాలు వేశారు అంటూ.. సమాచారం ఇవ్వడంతో పోలీసులు అధికారులు తహసిల్దార్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు.