అగ్ని గుండాల ప్రవేశంతో కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. చివరిఘట్టం అగ్నిగుండాల ప్రవేశం కార్యక్రమం మహా వైభవంగా జరిగింది. వీరభద్ర శరభ శరభ అని స్మరిస్తూ.. ఎర్రగా దగడగలాడే నిప్పుల్లో నడిచిన భక్తులు వారి భక్తి పారవశ్యాన్ని చాటుకున్నారు. సామాన్య భక్తులతో పాటు పోలీసులు కూడా అదే నిప్పుల్లో నడిచి భక్తిని చాటుకున్నారు.