గుజరాత్ మాజీ ప్రతిపక్షనేత, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు అర్జున్ మోద్వాడియా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. నరేంద్ర మోదీ నిజమైన ప్రజాస్వామ్యవాది అంటూ కితాబు ఇచ్చారు. మోదీ నాయకత్వంలోని ఒక అంశం ఏంటీ, ప్రతి విషయంలో ఆయనకు సాటి లేదన్నారు. ఆయన అందరి అభిప్రాయాలకు విలువనివ్వడమే కాకుండా వాటిని నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తారని ఆయన తెలిపారు. మోదీ ప్రత్యర్థులు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తారన్నారు. ప్రతిపక్షాల మాటకు విలువనిస్తూ, సలహాలు, సూచనలు సైతం పాటిస్తారని అర్జున్ మోద్వాడియా పేర్కొన్నారు.