నిజామాబాద్ జిల్లాలోని ఒక ఆదర్శ రైతు

అన్నదాత ఎవరైనా ఒక రకం పంట పండిస్తాడు.. లేదా సన్న దొడ్డు ధాన్యాలు రెండు పండిస్తారు..కానీ, నిజామాబాద్ జిల్లాలోని ఒక ఆదర్శ రైతు మాత్రం 150 రకాల వరి రకాలు పండించారు.. అవి కూడా ఇప్పటివి కాదు.. తాత ముత్తాతలు తిన్న రకాలు... అంతే కాదు.. తన మూడెకరాల పొలాన్ని ఒక ప్రయోగ శాలగా మార్చిన రూరల్ సైంటిస్ట్ అతను.. అగ్రికల్చర్ డాక్టర్ అని కూడా అనొచ్చు.. 72 ఏళ్ల వయసులో కూడా భావి తరాల మార్పు కోసం ప్రాచీన వరి వంగడాలు తెలుగు లోకానికి పరిచయం చేస్తున్నాడు ..అంతే కాదు తన తల్లి దండ్రుల చిత్రాలను వరి పంట రూపంలో పండించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన ఆయన తాజాగా ఈ సీజన్ లో సుదర్శన చక్రంతో పాటు తన విజిటింగ్ కార్డు ప్రతిదీ వరి పంటగా వేశాడు. ఎలాంటి డిగ్రీలు లేవు,శాస్త్రవేత్త అసలే కాదు.. అయినా ప్రకృతి వ్యవసాయంలో వినూత్న ప్రయోగాలు చేస్తూ దేశ వ్యాప్తంగా ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నాడు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆదర్శ రైతు చిన్ని కృష్ణుడు