Watch: భారీ వర్షం..ఈదురుగాలుల బీభత్సం.. ఏకంగా ఎగిరి పడిన టోల్ ప్లాజా..! ఎక్కడంటే..

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. టిల్డా మండలం తారపొంగి గ్రామ సమీపంలో భారీ ఈదురు గాలులకు టోల్ ప్లాజా విరిగి పడింది. గాలులతో కూడిన వర్షానికి తట్టుకోలేక టోల్ ప్లాజా నేలమట్టం అయ్యింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్‌ అయ్యాయి.