ఆటో డ్రైవర్‎కు కనిపించిన అదృశ్య శక్తి.. తవ్వకాలు చేసి చూస్తే.. ఊరంతా పండుగే

ఆటో డ్రైవర్‎కు కనిపించిన అదృశ్య శక్తి.. తవ్వకాలు చేసి చూస్తే.. ఊరంతా పండుగే తమ ఊరి గ్రామ శివారులో దేవుడు వెలిశాడంటూ గ్రామస్తులు తవ్వకాలు చేపట్టారు. తవ్వకాల్లో దొరికిన ఓ రాతికి మీసాల లక్ష్మీ నరసింహ స్వామి, వెంకటేశ్వర స్వామి దేవుని రూపాలు ఉండటంతో పూజలు చేశారు. ఇంకా విగ్రహాలు ఉన్నాయనే నమ్మకంతో త్రవ్వకాలు కొనసాగిస్తున్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పెద్ద మండవ గ్రామ సమీపంలో దేవుడు వెలిశాడంటూ గ్రామస్తులు తవ్వకాలు జరిపి ఓ రాయిని వెలికితీసి పూజలు చేశారు. గ్రామానికి చెందిన బుద్ధారపు శ్రీనివాస్ అనే వ్యక్తి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఒక రోజు రాత్రి వేళ తన పని ముగించుకుని తిరిగి గ్రామానికి వస్తుండగా గ్రామ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న పొదలో దేవుడు కనిపించినట్లు అనిపించడంతో గ్రామస్తులకు తెలిపారు. గ్రామస్తులు నమ్మకపోవడంతో తానే స్వయంగా కొంతమంది గ్రామస్తులతో ముక్కోటి ఏకాదశి రోజున కొంత మేర తవ్వకాలు చేపట్టి వదిలివేశారు.