ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన భారీ కొండచరియలు.. అల్లకల్లోలంగా మారిన ప్రాంతం

భారీ కొండచరియలు విరిగిపడితే ఎంత విధ్వంసం చోటు చేసుకుంటుందో ఎప్పుడైనా చూశారా? కనీసం టీవీలో వీడియో అయినా చూశారా? భారీగా ఉన్న కొండలు అంత ఎత్తు నుంచి కూలి పడిపోతే ఎంత భయానకంగా ఉంటుందో అసలు ఊహించలేం. తాజాగా ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో అదే జరిగింది. ధార్చులలోని తవాఘాట్ సమీపంలోని హైవేపై అకస్మాత్తుగా పెద్ద కొండచరియలు విరిగిపడడంతో ఆ ప్రాంతం అల్లకల్లోలంగా మారింది.