జనం వెంట పడి దాడి చేసిన ఎలుగుబంటి..

శ్రీకాకుళం జిల్లా మందస మండలం నారాయణపురంలో గత రెండు రోజులుగా హల్ చల్ చేస్తోన్న ఎలుగుబంటి మృతి చెందింది. స్థానిక తోటల్లో విగతజీవిగా పడి ఉన్న బల్లూకంను చూసిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. దాంతో అటవీ,పోలీస్ అధికారులు ఘటన స్థలికి చేరుకుని పరిశీలించారు. ఎలుగుబంటి కళేబరానికి అక్కడే వైద్యులతో పోస్ట్ మార్టం నిర్వహించారు. ఎలుగుబంటి మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.