పెళ్లిలోని సంతోషకరమైన వాతావరణంలో అకస్మాత్తుగా తీవ్ర గందరగోళం చెలరేగింది. వధువు వేదికపై కూర్చుని వరుడి కోసం ఎంతో సంతోషంగా ఎదురు చూస్తోంది. అనంతలోనే పెళ్లి మండపంలో ఒక్కసారిగా అరుపులు, కేకలు వినిపించాయి. వధూవరుల తరపు వ్యక్తుల మధ్య వాగ్వాదం తీవ్ర పోరాటానికి దారితీసింది. ఈ ఘర్షణలో 20 మందికి పైగా పెళ్లికి వచ్చిన అతిథులు, బంధువులు గాయపడ్డారు.