హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఈ తెల్లారు జామున నగర వ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. ఇందిరానగర్‌లోని రోడ్డులో ఓ వ్యక్తి బైక్‌తో సహా కొట్టుకుపోయాడు. గ్రీన్ బావర్చి హోటల్ సమీపంలో టూవీలర్ అదుపుతప్పడంతో ఓ వ్యక్తి వరదలో కొట్టుకుపోయాడు. అతన్ని గమనించిన స్థానికులు అప్రమతమై, అతన్ని కాపాడారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.