యూకేలోని మాంచెస్టర్‌లో ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ఓ వంతెనను దాటే క్రమంలో డబుల్ డెక్కర్ బస్సు పైకప్పు పూర్తిగా ఊడిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు మాంచెస్టర్ పోలీసులు వెల్లడించారు. కాగా, ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ప్రమాద సమయంలో బస్సు రెండో అంతస్తులో నుంచి ఇద్దరు వ్యక్తులు కింద పడ్డారని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.