మిరప తోటలో చాటు యవ్వారం..!

వ్యవసాయంలో నష్టాలు వచ్చేటప్పుడు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్పిన మాటలు ఓ రైతుకు వేరేలా అర్థమైంది. ఇక వ్యవసాయం దండగ అనుకున్నాడో.. ఏమో..! గంజాయి సాగు చేస్తూ పండగ చేసుకుంటున్నాడు. శ్రీసత్యసాయి జిల్లా గుడిబండ మండలం మందలపల్లి గ్రామంలో హనుమంతరాయప్ప అనే రైతు మిరప తోటలో గంజాయి సాగు మొదలుపెట్టాడు.