తెలంగాణ ఉద్యమాన్ని నడపడంలోనైనా.. రాష్ట్రం ఏర్పాడ్డాక ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని నడపడంలోపైనా బీఆర్ఎస్‌ది వినూత్న శైలి. పదేళ్ల తర్వాత అధికారానికి దూరమై పార్టీ పరిస్థితి అగమ్యగోరంగా ఉన్న తరుణంలో అటు పార్టీ ప్రెసిడెంట్.. ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ సేమ్ డైలాగ్స్‌తో మళ్లీ గులాబీ కేడర్ పార్టీని అధికారంలోకి తెచ్చేలా పనిచేసేందుకు ప్రేరేపిస్తున్నారు.