హైదరాబాద్ లోని వనస్థలిపురం NGOS కాలనీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివేకానంద పార్క్ వద్ద రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువతిని అతివేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఆమె 10 మీటర్ల దూరంలో ఎగిరిపడింది. తీవ్ర గాయాలు కాగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.