రక్తదానం చేయండి.. ఫ్రీగా టీ తాగండి..! ఇదేంటి రక్తదానం చేసిన వారికి ఎక్కడైనా పండ్లు అందిస్తారు. ఇక్కడ ఏంటీ టీ ఇస్తున్నారని అనుకుంటున్నారా..? ఓ టీ స్టాల్ నిర్వాహకుడు రక్తదానమును ప్రోత్సహించాలనే ఆలోచనతో ఇలా చేస్తున్నాడు. రక్తదానం చేయండి.. ఫ్రీగా టీ తాగండి అంటూ అతడు చేసిన పోస్టు సామాజిక మధ్యమాలు ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. అతని సామాజిక స్పృహాను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.