మామిడి చెట్లకు పెళ్లి.. ఇదో వింత ఆచారం.. ఆసక్తిగా తిలకించిన స్థానికులు..

జగిత్యాల జిల్లాకు చెందిన ఓ రైతు మామిడి చెట్లకు పెళ్లి తంతు నిర్వహించారు. ఆక్సిజన్ అందించడమే కాకుండా ఫలాలను అందించే మామిడి చెట్లకు కూడా వివాహం జరిపించేందుకు రైతు చూపించిన ఆసక్తి పలువురిని ఆకట్టుకుంది. జిల్లాలోని బీర్ పూర్ మండలం తుంగూరు గ్రామ రైతులు ఓగుల అనిల, అజయ్ దంపతులు తమ తోటలోని మామిడి చెట్లకు వివాహం ఘనంగా జరిపించారు.