మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారుతున్నాయి. ఈ ఘటన అక్షరాల నిరూపించింది. తమకు తక్కువ వాటా భూమిని ఇచ్చారనే కోపంతో తండ్రిలా చూసుకోవాల్సిన మామను కోడలు చెప్పుతో దాడికి దిగింది. వృద్ధుడైన మామను.. కోడలు కొడుతుంటే నోరులేని మూగజీవం.. విశ్వాస జంతువుగా పేరు ఉన్న శునకానికి ఉన్న కనికరం ఆ మనిషికి లేకుండాపోయింది. కుక్క మాత్రం దాడిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఈ అమానవీయ ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది.