ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ మాజీ సీఎం కేసిఆర్‌పై విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ను తొక్కుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ వచ్చి సీఎం కుర్చీ లాక్కున్నా.. ఇక తెలంగాణ గడ్డపై కేసీఆర్ అనే మొక్కను మొలవనివ్వను అంటూ సీఎం రేవంత్ రెడ్డి శపథం చేశారు. ఫామ్ హౌజ్ లో పడుకుని ఎలాంటి కుట్రలు చేస్తున్నారో తెలుసని అన్నారు. తేదీ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే అసెంబ్లీకి రా చర్చ పెడదాం.. దమ్ముంటే అసెంబ్లీ కి రా అంటూ కేసీఆర్‌కు సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి.